Cat: నిజమైన టామ్ అండ్ జెర్రీని ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో

Tom and Jerry In Real Life Viral Video Of Cat Mouse Fighting and Cuddling is Too Cute
  • నెట్టింట వైరల్ అయిన పిల్లి, ఎలుక చిలిపి ఆట
  • అలసిపోయి మార్జాలం ముందటి కాళ్ల సందులో సేదతీరిన మూషికం
  • సహజ జాతి వైరం మరచి స్నేహం
  • అవాక్కవుతున్న నెటిజన్లు.. వీడియోకు ఏకంగా కోటికిపైగా వ్యూస్, 13 లక్షల లైక్స్
ప్రఖ్యాత యానిమేటెడ్ కార్టూన్ షో  టామ్ అండ్ జెర్రీ గుర్తుందా? టామ్ అనే పిల్లి, జెర్రీ అనే ఎలుక మధ్య ఆద్యంతం జరిగే పోరు అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతుంది. కానీ ప్రస్తుతం నిజమైన టామ్ అండ్ జెర్రీ సన్నివేశం నెట్టింట హల్ చల్ చేస్తోంది. జాతి వైరం మరచి పిల్లి, ఎలుక సరదాగా చిలిపి ఆటలు ఆడుకుంటున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో ఓ యూజర్ ఐదు రోజుల కిందట పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఏకంగా కోటికిపైగా వ్యూస్ లభించాయి. అలాగే 13 లక్షల లైక్స్ వచ్చాయి.

ఆ వీడియోలో ఓ ఇంటి కిటికీ వెలుపల ఎలుక దాక్కోగా పిల్లి దాన్ని చూడటం కనిపించింది. ఆ వెంటనే పిల్లి తన ముందటి కాళ్లతో ఎలుకను లాగి పట్టుకొనేందుకు ప్రయత్నించింది. దీంతో ఎలుక పారిపోకుండా పిల్లిని ప్రతిఘటించింది. పిల్లి కాళ్లను నెట్టేస్తూ మరింత ఇరుకైన సందులో దూరాలని చూసింది. అనంతరం పిల్లి ముందటి కాళ్ల మధ్య ఎలుక సేదతీరుతుండగా పిల్లి తన తలను ఎలుకపై వాల్చి నిద్రించింది.  అంతటితో ఆ వీడియో క్లిప్ ముగిసింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘మాది టామ్ వర్సెస్ జెర్రీ ఆట కాదు.. టామ్ అండ్ జెర్రీ ఆట అని ఈ పిల్లి, ఎలుక గుర్తించినట్లున్నాయి’ అని ఓ యూజర్ కామెంట్ పోస్ట్ చేశారు. మరొకరు స్పందిస్తూ ‘డిన్నర్ కోసం ఎలుకను అలా పట్టుకున్నట్లు ఉంది’ అని పేర్కొన్నారు. ఇంకొకరేమో ‘రానున్న టామ్ అండ్ జెర్రీ ఎపిసోడ్ లా ఉంది’ అని కామెంట్ చేశారు.

2009లోనూ ఈ తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. అమెరికాకు చెందిన మ్యాగీ స్పాట్ అనే మహిళ రాంజ్ అనే పిల్లిని, పీనట్ అనే ఎలుకను పెంచుకుంది. పిల్లితో ఎలుక నిరంతరం కలిసి ఆడుకొనేది. వాటి ప్రత్యేకమైన స్నేహబంధం అప్పట్లో వాటిని స్టార్లుగా మార్చేసింది. ఓ టీవీ చానల్ వాటి యజమానురాలిని ఇంటర్వ్యూ కూడా చేసింది. రెండేళ్ల తర్వాత వృద్ధాప్యంతో ఎలుక మరణించడంతో ఇంటి యజమానురాలు ఆ తర్వాత పిల్లితో స్నేహానికి మరో పిల్లిని తీసుకొచ్చింది.
Cat
Mouse
Friendship Fight
Viral
Video
Netizens
Amused

More Telugu News