Jeevan Reddy: నిజామాబాద్‌లో ఆ తర్వాతే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి టర్న్ అయ్యాయి: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
- నిజామాబాద్‌లో కేసీఆర్ టూర్ తర్వాత బీజేపీకి టర్న్ అయినట్లు వెల్లడి
- పోలింగ్ నాటికి బీఆర్ఎస్ కనుమరుగైందని వ్యాఖ్య
- రెండు పార్టీల మధ్య ఏం ఒప్పందం జరిగిందో తెలియదన్న జీవన్ రెడ్డి
- తెలంగాణలో కాంగ్రెస్ 12 సీట్ల వరకు గెలుస్తుందని ధీమా
నిజామాబాద్‌లో కేసీఆర్ టూర్ తర్వాత బీఆర్ఎస్ ఓట్లు అన్నీ బీజేపీకి టర్న్ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిజామాబాద్‌లో తొలుత బీఆర్ఎస్ పోటీలో ఉందన్నారు. కానీ కేసీఆర్ పర్యటన తర్వాత సీన్ మారిపోయిందన్నారు.
పోలింగ్ నాటికి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందన్నారు. రెండు పార్టీల మధ్య ఏం ఒప్పందం జరిగిందో తెలియదన్నారు. అయినప్పటికీ తాను 50 వేలు, అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తాము 10 నుంచి 12 లోక్ సభ స్థానాలు గెలుస్తామని జోస్యం చెప్పారు.