Klin Kaara: క్లీంకారకు 'కల్కి' టీం స్పెషల్‌ గిఫ్ట్.. థ్యాంక్స్‌ చెప్పిన ఉపాసన!

Ram Charan daughter Klin Kaara has found new friend in Prabhas starrer Kalki 2898 AD Bujji
  • క్లీంకారకు బుజ్జి-భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ పంపిన కల్కి టీమ్‌
  • ఈ విష‌యాన్ని ఇన్‌స్టా ద్వారా పంచుకున్న ఉపాస‌న‌
  • ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో 'కల్కి 2898 ఏడీ'
  • జూన్ 27న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్న మూవీ
  • జోరుగా ప్రచార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న చిత్రం యూనిట్‌
రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. టాలీవుడ్‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా జూన్ 27న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది. దీంతో మేకర్స్ ప్ర‌స్తుతం జోరుగా ప్రచార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగానే సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్‌లు పంపుతోంది చిత్రం యూనిట్‌. 

తాజాగా గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాస‌న దంప‌తుల‌ కుమార్తె క్లీంకారకు కూడా క‌ల్కి మూవీ టీమ్ ఒక ప్ర‌త్యేక బ‌హుమ‌తి పంపించింది. అందులో బుజ్జి-భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా మెగా కోడలు.. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌తో పాటు 'ఆల్‌ ది బెస్ట్‌' చెప్పారు. 
ఇదిలాఉంటే.. ప్రస్తుతం బుజ్జి, భైరవ స్టిక్కర్స్ సామాజిక మాధ్య‌మాల్లో వైరలవుతున్నాయి. కాగా వీటిని మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రచారంలో భాగంగానే తాజాగా 'బుజ్జి అండ్‌ భైరవ' పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ ల‌భిస్తోంది. 

ఇక 'క‌ల్కి 2898 ఏడీ'లో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ దీపిక పదుకొణె నటిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్, పశుపతి, దిశా పటానీ కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే సీనియర్ న‌టుడు కమల్‌ హాసన్ ప్ర‌తినాయ‌క‌ పాత్రలో కనిపించనున్నారు.
Klin Kaara
Kalki 2898 AD
Bujji
Ram Charan
Tollywood
Upasana Kamineni Konidela

More Telugu News