ICC: టీ20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీని భారీగా పెంచిన ఐసీసీ

ICC has announced winner of T20 World Cup 2024 will get the highest ever prize money
  • ప్రైజ్‌మనీ కోసం రూ.93.51 కోట్లు కేటాయింపు 
  • ప్రపంచ కప్ విజేత జట్టుకు రూ.20.3 కోట్ల ప్రైజ్‌మనీ
  • రన్నర్ జట్టుకు రూ10.64 కోట్లు  
  • భారీగా పెంచిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
టీ20 వరల్డ్ కప్-2024 కోసం పోటీ పడుతున్న జట్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీ కోసం భారీ ప్రైజ్‌మనీని ప్రకటించింది. మొత్తం రూ.93.51 కోట్లు కేటాయించింది. అత్యధికంగా రూ.20.3 కోట్లు టైటిల్ విజేతకు అందజేయనున్నట్టు ఐసీసీ వెల్లడించింది. కాగా టీ20 వరల్డ్ కప్‌-2022ను ముద్దాడిన ఇంగ్లండ్‌ దాదాపు రూ.12 కోట్ల మొత్తం నగదు బహుమతిగా స్వీకరించింది.

కాగా ప్రస్తుత వరల్డ్ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా ప్రతి జట్టు కనీసం రూ.1.87 కోట్ల మొత్తాన్ని ప్రైజ్‌మనీగా పొందింది. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.10.64 కోట్లు, సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయే జట్లు రూ. 6.55 కోట్లు చొప్పున, సూపర్-8 దశలో వెనుదిరిగిన జట్లు రూ. 3.18 కోట్లు, ప్రతి గ్రూపులో 3వ స్థానంలో నిలిచిన జట్లు రూ. 2.06 కోట్లు, మిగిలిన జట్లు రూ. 1.87 కోట్ల మొత్తాన్ని ప్రైజ్‌మనీగా స్వీకరించనున్నాయి. కాగా జూన్ 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ICC
T20 World Cup 2024
Cricket
Cricket News

More Telugu News