Atishi: కేజ్రీవాల్‌కు జైల్లో కూలర్ కూడా ఇవ్వలేదు: ఢిల్లీ మంత్రి అతిశీ ఆగ్రహం

No cooler for Arvind Kejriwal in jail despite Delhi scorching heat says Atishi
  • కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడానికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపణ
  • జైల్లో ఇబ్బందులు పెట్టేందుకు సిబ్బందితో కలిసి మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న మంత్రి
  • మోదీ ప్రభుత్వం ఇంకెంత దిగజారుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్య
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ ఆరోపించారు. ఢిల్లీలో ఎండ వేడి ఎక్కువగా ఉందని, కనీసం జైల్లో ఆయనకు కూలర్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడానికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. జైల్లో ఆయనను హింసిస్తున్నారన్నారు.

జైల్లో ఇబ్బందులు పెట్టేందుకు సిబ్బందితో కలిసి మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఆయన ఆరోగ్యంతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం ఇంకెంత దిగజారుతుందో అర్థం కావడం లేదన్నారు. కోపానికి హద్దు లేదా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక బరువు తగ్గిపోయారన్నారు. ముందు రికార్డ్ చేసిన బరువును తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో కేంద్రం డ్రామాలు ఆడుతోందన్నారు.
Atishi
Arvind Kejriwal
AAP
Lok Sabha Polls

More Telugu News