PM Modi: వార‌ణాసిలో ప్ర‌ధాని మోదీ ఆధిక్యం.. గాంధీన‌గ‌ర్‌లో అమిత్‌షా ముందంజ‌

PM Modi Leading in Varanasi
  • యూపీలోని వార‌ణాసిలో ప్ర‌ధాని మోదీ ముందంజ‌
  • గాంధీన‌గ‌ర్‌లో అమిత్‌షా ఆధిక్యం
  • నాగ్‌పూర్‌లో నితిన్ గ‌డ్క‌రీ ఆధిక్యం
లోక్‌స‌భ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ మొదలైంది. 543 లోక్ సభ స్థానాలకు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు కౌంటింగ్ చేపట్టారు. ఇక‌ వార‌ణాసిలో బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు గాంధీన‌గ‌ర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందంజ‌లో ఉన్నారు. అలాగే నాగ్‌పూర్‌లో నితిన్ గ‌డ్క‌రీ ఆధిక్యంలో ఉన్నారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముందంజ‌లో ఉన్నారు.
PM Modi
Varanasi
Lok Sabha Polls

More Telugu News