G. Kishan Reddy: మోదీ ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు... రెండో వారంలో ప్రమాణ స్వీకారం ఉండొచ్చు: కిషన్ రెడ్డి

Kishan Reddy says BJP will get double digit in Telangana
  • భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో బీజేపీ విజయం సాధించబోతోందన్న కిషన్ రెడ్డి
  • బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు ఖాయమన్న కిషన్ రెడ్డి
  • ఎగ్జిట్ పోల్స్‌ను మోదీ పోల్స్ అన్న రాహుల్ గాంధీకి చురక
తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... అమ్మవారి ఆశీస్సులతో బీజేపీ భారీ విజయం సాధించబోతోందన్నారు. రెండో వారంలో మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టే అవకాశముందన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకున్నారన్నారు.

పూర్తి ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరగాలని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని తాను భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఆ దిశగానే బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌ను మోదీ పోల్స్ అన్న రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి చురక అంటించారు. 'ఇంకా నయం.. రీఎగ్జిట్ పోల్స్ చేయాలని డిమాండ్ చేయలేదు' అని ఎద్దేవా చేశారు.
G. Kishan Reddy
Lok Sabha Polls
BJP
Narendra Modi

More Telugu News