Lok sabha Results: ఎన్నికల ఫలితాల్లో అగ్రనేతల పరిస్థితి ఏంటంటే..!

Key Candidates Results Position

  • భారీ మెజారిటీతో గెలుపొందిన అమిత్ షా
  • వారణాసిలో లీడ్ లో కొనసాగుతున్న మోదీ
  • వయనాడ్, రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ భారీ ఆధిక్యం

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో దేశంలోని ప్రధాన పార్టీలకు చెందిన కీలక అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందంటే.. బీజేపీ తరఫున గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం లీడ్ లో కొనసాగుతున్నారు. ప్రారంభంలో వెనుకంజలో ఉన్నా.. తర్వాతి రౌండ్లలో ముందంజలోకి వచ్చారు. 

ఇక ఈ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అటు వయనాడ్ లో, ఇటు రాయ్ బరేలీలో లక్ష ఓట్ల మెజారిటీతో దూసుకెళుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్రలోని బారామతి నుంచి పోటీ చేసిన ఎన్సీపీ అభ్యర్థి సుప్రియా సూలె, షోలాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితీ సుశీల్ కుమార్ షిండే, కర్ణాటకలోని బీడ్ లో బీజేపీ అభ్యర్థి పంకజ గోపీనాథ్ ముండే, ఒడిశాలోని సంబల్ పూర్ లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, శిరోమణి అఖాలీదళ్ నుంచి భటిండాలో బరిలోకి దిగిన హర్ సిమ్రత్ కౌర్ ముందంజలో కొనసాగుతున్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పూర్ లో ఎస్పీ చీఫ్ భార్య డింపుల్ యాదవ్ లీడ్ లో ఉన్నారు. లక్నో నుంచి బరిలోకి దిగిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్, జోధ్ పూర్ లో బీజేపీ క్యాండిడేట్ గజేంద్ర సింగ్ షెకావత్ లీడ్ లో ఉన్నారు. హమిర్‌పూర్ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి అనురాగ్ శర్మ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక చెన్నై సౌత్ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్ తమిళిసై సౌందరరాజన్ మాత్రం ఫలితాల్లో వెనుకబడ్డారు. కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై కూడా వెనుకంజలోనే ఉన్నారు. విరుద్ నగర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్, రామనాథపురంలో పన్నీర్ సెల్వం, కురుక్షేత్రలో బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్ వెనుకంజలో ఉన్నారు.

  • Loading...

More Telugu News