Komatireddy Venkat Reddy: రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy says BRS will merged in Congress
  • బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిందని ఆగ్రహం
  • త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని వ్యాఖ్య
  • కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్న కోమటిరెడ్డి
కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు వచ్చిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దాదాపు 300 సీట్లు, ఇండియా కూటమి దాదాపు 200 స్థానాలు గెలుచుకుంటుందని ట్రెండ్స్ చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి టీవీ9 ఛానల్‌తో మాట్లాడుతూ... కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారన్నారు. బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు.
Komatireddy Venkat Reddy
BJP
Congress
Lok Sabha Polls
Rahul Gandhi

More Telugu News