AP Assembly Poll Results: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

YSRCP Senior Leader Vijayasai Reddy made Interesting comments of on AP assembly election Results
  • రాష్ట్ర ప్రజలు కూటమికి తీర్పు ఇచ్చారన్న వైసీపీ నేత  
  • ప్రజల తీర్పుని శిరసా వహిస్తామని ప్రకటన
  • వైసీపీ ఓటమిపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తామని ప్రకటన
  • సమీక్షల అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల తీర్పుని శిరసా వహించాల్సిందేనని, ఈ విధంగా నడుచుకోవడం రాజ్యాంగ బద్ధమైనదని ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌సీపీ ఎదుర్కొన్న ఓటమికి కారణాలను సమీక్షించుకోవాల్సి ఉందని, ఎక్కడ పొరపాటు జరిగింది? ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలకు నచ్చనిది తాము ఏం చేశాం? తాము చేసిన పనులను ప్రజలు ఎందుకు ఆదరించలేదు? అనే విషయాలను కూలంకషంగా చర్చిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గ నాయకులు, నేతలు ప్రతి ఒక్కరితో సమీక్షలు నిర్వహించిన అనంతరం తమ పార్టీ అధ్యక్షుడు తదుపరి కార్యాచరణను చేపడతారని విజయసాయి రెడ్డి ప్రకటించారు.
AP Assembly Poll Results
YSRCP
Vijayasai Reddy
AP Assembly Polls
Andhra Pradesh

More Telugu News