Priyanka Gandhi: అమేథీలో స్మృతి ఇరానీపై కాంగ్రెస్ గెలవడంపై ప్రియాంకగాంధీ ట్వీట్

Priyanka Gandhi responds on congress winning from Amethi
  • స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ విజయం
  • కిశోరీ లాల్ భయ్యా.. మీరు గెలుస్తారని నాకు ముందే తెలుసన్న ప్రియాంక
  • మీ విషయంలో ఎప్పుడూ సందేహించలేదన్న ప్రియాంకగాంధీ
అమేథీ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ గెలుపొందడంపై ప్రియాంకగాంధీ స్పందించారు. అమేథీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ 2019లో స్మృతి ఇరానీ గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ దానిని తిరిగి కైవసం చేసుకుంది. దీంతో ప్రియాంకగాంధీ సోషల్ మీడియా వేదికపై ఓ పోస్ట్ పెట్టారు. 'కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు... మీ విషయంలో నేను ఎప్పుడూ సందేహించలేదు' అని పేర్కొన్నారు. మీకు, అమేథీ నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు అభినందనలు అని రాసుకొచ్చారు.
Priyanka Gandhi
Lok Sabha Polls
Congress
Smriti Irani

More Telugu News