Lok Sabha Election Results: వారణాసి నుంచి వరుసగా మూడోసారి గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi wins Varanasi for third time in a row against Congress Ajay Rai in Lok Sabha elections 2024
  • కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై గెలుపు
  • 1,52,513 ఓట్ల తేడాతో ఘన విజయం
  • వారణాసి నుంచి మూడోసారి విజయం సాధించిన నరేంద్ర మోదీ
లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై 1,52,513 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మోదీకి మొత్తం 6,12,970 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఒకానొక దశలో గట్టి పోటీ ఇచ్చారు. ఇక బీఎస్పీ నుంచి అథర్ జమాల్ పోటీ చేశారు.

తాజా గెలుపుతో వారణాసి నుంచి వరుసగా మూడోసారి మోదీ ఎంపీగా గెలిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ఎస్‌పీ-బీఎస్‌పీ కూటమి అభ్యర్థిగా నిలిచిన ఎస్‌పీ అభ్యర్థిని షాలినీ యాదవ్‌ను 4,79,505 ఓట్ల తేడాతో మోదీ ఓడించిన విషయం తెలిసిందే.
Lok Sabha Election Results
Narendra Modi
BJP
Varanasi

More Telugu News