AP Assembly Poll Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Telangana CM Revanth Reddy first reaction on AP election results 2024
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అభినందనలు తెలిపిన తెలంగాణ సీఎం
  • ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామంటూ పిలుపు
  • సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామంటూ రేవంత్ ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2024లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. చారిత్రాత్మకంగా 165 సీట్లను కూటమి పార్టీలు దక్కించుకోవడం ఖాయమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి నా అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ, సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదాం అంటూ తన అభిలాషను వ్యక్తం చేశారు.
AP Assembly Poll Results
AP Assembly Polls
Revanth Reddy
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News