Renu Desai: ప‌వ‌న్ విజ‌యంపై రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర‌ పోస్ట్‌.. నెట్టింట వైర‌ల్‌!

Renu Desai Posted Interesting Post on Pawan Kalyan Victory on Instagram
  • ఏపీ సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో భారీ విజ‌యం దిశ‌గా టీడీపీ కూట‌మి 
  • ఇప్పటికే జనసేనాని పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపు
  • పవన్‌కు విషెస్‌ తెలుపుతూ సాయి ధరమ్, నితిన్, చిరంజీవి, అల్లు అర్జున్ పోస్టులు  
  • ఇదే కోవ‌లో మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్
ఏపీ సార్వ‌త్రిక‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతపై దాదాపు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో జనసేనాని గెలుపుపై సినీ పరిశ్రమలోని నటీనటులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు పవన్ క‌ల్యాణ్‌ ఇంటికి చేరుకోగా.. పలువురు సినీ సెలబ్రెటీలు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ పవన్‌కు విషెస్‌ తెలుపుతూ పోస్టులు పెట్టిన విష‌యం తెలిసిందే. ఇక పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

"ఆద్య, అకీరాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను" అంటూ ఇంట్లో ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్టుపై నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు స్పందిస్తున్నారు. పవన్ గెలుపును జనసైనికులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Renu Desai
Pawan Kalyan
Instagram
Andhra Pradesh
Janasena

More Telugu News