BJP Vote Share: బీజేపీకి సీట్లు తగ్గినా.. ఓట్ల శాతం యథాతథం!

Congress vote share sees significant jump in Lok Sabha results BJP count unchanged
  • గత ఎన్నికల్లో బీజేపీకి 37.37 శాతం ఓట్లు
  • ఈ ఎన్నికల్లో 37.34 శాతం ఓట్లు సాధించిన వైనం
  • సీట్లు, ఓట్ల పరంగా గణనీయంగా మెరుగుపడ్డ కాంగ్రెస్
  • ఎన్డీఏకు షాకిచ్చిన మహారాష్ట్ర, యూపీ ఫలితాలు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. ఎన్డీఏ 390- 400 సీట్లు సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. మెజారిటీ మార్కు కంటే 21 సీట్లు అధికంగా ఎన్డీఏ 293 సీట్లు సాధించింది.  ఈసారి బీజేపీకి 240 సీట్లు మాత్రమే దక్కాయి. 

అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గినా బీజేపీ ఓట్ల శాతంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో కమలం పార్టీకి 37.37 శాతం ఓట్లు రాగా ఈసారి 37.34 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ సీట్ల పరంగానే కాకుండా ఓట్ల పరంగానూ బాగా పుంజుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 19.49 శాతం ఓట్లు రాగా ఈసారి 22.34 శాతం ఓట్లు సాధించింది. ఇక ఇండియా కూటమికి సుమారు 42 శాతం ఓట్లు రాగా ఎన్డీఏ కూటమి 45 శాతం ఓట్లు సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో ఎన్డీఏ చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లు కోల్పోయింది.
BJP Vote Share
Congress
NDA
INDIA Bloc
Lok Sabha Election Results

More Telugu News