Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు హైకోర్టులో షాక్... బెయిల్ పొడిగించేందుకు నో

Delhi court denies interim bail to CM Arvind Kejriwal
  • వైద్య పరీక్షల కోసం బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్
  • పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం
  • నేడు పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
  • జూన్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే కేజ్రీవాల్
తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను తాజాగా తిరస్కరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగించింది. ఆయన వైద్య అవసరాలను చూసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది.
Arvind Kejriwal
AAP
Delhi Liquor Scam

More Telugu News