Hema: డ్రగ్స్ కేసు ఎఫెక్ట్... 'మా' నుంచి నటి హేమ సస్పెన్షన్?

Actress Hema to be suspended from MAA
  • సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న అధ్యక్షుడు మంచు విష్ణు
  • ఆమెను సస్పెండ్ చేయాలని మెజార్టీ సభ్యుల అభిప్రాయం
  • రేపు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించే అవకాశం
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమను తమ సంస్థ నుంచి సస్పెండ్ చేయాలని 'మా' దాదాపు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురి నుండి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో హేమను సస్పెండ్ చేయాలని కమిటీ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో 'మా' కమిటీ ఉంది.

'మా' అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. హేమను సస్పెండ్ చేయడంపై సభ్యుల అభిప్రాయాలు కోరగా... మెజార్టీ సభ్యులు సస్పెండ్ చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అమెకు క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
Hema
Manchu Vishnu
Drugs Case
Tollywood

More Telugu News