AP Assembly: ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్

Governor issues notification to abort AP Assembly

  • జూన్ 16 వరకు ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి 
  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ
  • దాంతో ముందుగానే శాసనసభను రద్దు చేసిన గవర్నర్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవగా, టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి జగన్ నిన్ననే రాజీనామా చేయగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా నేడు ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

వాస్తవానికి ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి జూన్ 16 వరకు ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాలు రావడం, వైసీపీ ఓటమిపాలవడంతో అసెంబ్లీని రద్దు చేయకతప్పలేదు. ఆర్టికల్ 174 అనుసరించి, రాష్ట్ర క్యాబినెట్ సిఫారసుతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News