T20 World Cup 2024: ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్
- నేడు భారత్, ఇర్లాండ్ మధ్య న్యూయార్క్ లో మ్యాచ్
- ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ
- టీ20 వరల్డ్ కప్2024లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఐర్లాండ్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. ఇలాంటి పిచ్ నుంచి ఏం ఆశించాలో తెలుసునని, తాము ఆడిన పిచ్ కంటే కాస్త విభిన్నంగా ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
‘‘ ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ప్రాక్టీస్ బాగానే చేశాం. ఈ వాతావరణంలో ఆడడానికి అలవాటు చేసుకోవాలి. కాస్త సవాలుగానే అనిపిస్తుంది. కానీ మేమంతా ప్రొఫెషనల్ క్రికెటర్లం. ఈ పిచ్‌పై ముందుగా ఒక లక్ష్యం ఉంటే బాగుంటుందని భావించాను. కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌తో పాటు మరొకరికి చోటు దక్కలేదు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
తుది జట్లు ఇవే..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాస్ లిటిల్, బెంజమిన్ వైట్.