Graduate MLC Elections: కొనసాగుతున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు

Counting Underway for Warangal Khammam Nalgonda Graduate
  • మొదటి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తే విజేతగా ప్రకటిస్తారు
  • తొలి ప్రాధాన్యతలో 96 వేల ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది
  • తొలి ప్రాధాన్యత ఓటులో 50 శాతానికి మించి రాకుంటే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓటులో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యతలో 96 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. మిగిలిన 2,40,013 ఓట్ల లెక్కింపునకు తెల్లవారుజాము వరకు సమయం పట్టవచ్చునని తెలుస్తోంది.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, చెల్లని ఓట్లను వేర్వేరు చేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న ముందున్నప్పటికీ రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాకుంటే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటులో చాలావరకు చెల్లని ఓట్లు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నల్గొండ జిల్లా దుప్పలపల్లి గోదాములో 96 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేశారు. ఓట్ల లెక్కింపులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. బ్యాలెట్ ఓట్లు కావడంతో తుది ఫలితం ఆలస్యమవుతోంది. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్‌కు ఒకటి చొప్పున ఇస్తున్నారు. సిబ్బంది వాటిని టేబుల్ పైన పోసి 25 బ్యాలెట్ పేపర్లు ఒక కట్టగా కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా వీటితో కలిపి లెక్కిస్తున్నారు.
Graduate MLC Elections
Telangana
Rakesh Reddy

More Telugu News