Chandrababu Naidu: టీడీపీ విజ‌యంపై ఎన్‌టీఆర్ ట్వీట్.. స్పందించిన చంద్ర‌బాబు

TDP President Nara Chandrababu Naidu Reply to Jr NTR Tweet
  • ఏపీలో టీడీపీ కూటమి సునామీ
  • అద్భుత‌మైన విజ‌యాల‌తో దూసుకెళ్లిన‌ టీడీపీ, జనసేన, బీజేపీ
  • చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, పురందేశ్వరి, శ్రీభరత్‌ల‌కు తార‌క్‌ విషెస్
  • 'థాంక్యూ వెరీ మ‌చ్ అమ్మ' అంటూ టీడీపీ అధినేత రిప్లై
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించిన త‌న మావ‌య్య‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపిన సంగ‌తి తెలిసిందే. "ప్రియమైన చంద్రబాబు మామయ్యకి.. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్‌కు నా శుభాకాంక్షలు" అంటూ తార‌క్ ట్వీట్ చేశారు. 

దీనిపై చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. 'థాంక్యూ వెరీ మ‌చ్ అమ్మ' అంటూ జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు బ‌దులిచ్చారు. అలాగే త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేశ్‌బాబు, ఇత‌ర రాజకీయ‌, సినీ ప్ర‌ముఖుల‌కు సైతం ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.  

ఇక ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విష‌యం తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా, అందులో టీడీపీ సొంతంగా 135 స్థానాల్లో గెలిచింది. అలాగే 16 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ కైవ‌సం చేసుకుంది. దీంతో వైసీపీ 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. అటు, జనసేన, బీజేపీ కూడా దూసుకెళ్లాయి. జనసేన తాను పోటీ చేసిన‌ 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజ‌య‌ఢంకా మోగించింది. అదే స‌మ‌యంలో 2 ఎంపీ స్థానాలను కూడా కైవ‌సం చేసుకుంది. ఇక బీజేపీ 8 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్ల‌ను సాధించింది.
Chandrababu Naidu
Jr NTR
Twitter
TDP
Andhra Pradesh

More Telugu News