Pinnelli Ramakrishna Reddy: వైసీపీ నేత పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. పారిపోకుండా ఇంటి చుట్టూ మఫ్టీలో పోలీసులు

YCP leader Pinnelli Ramakrishna Reddy Will Be Arrested Today Or Tomorrow
  • నేటితో ముగియనున్న పిన్నెల్లి బెయిలు గడువు
  • ఈవీఎం ధ్వంసం కేసు సహా మూడు హత్యాయత్నం కేసులు
  • ఈసారి రాష్ట్రం దాటకుండా అడ్డుకునేందుకు ఎస్పీ ఆదేశాలతో ఇంటి చుట్టూ పోలీసుల పహారా
ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. మే 13న పోలింగ్ జరుగుతుండగా అనుచరులతో కలిసి పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి.. ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. వీవీపాట్‌ను కూడా బద్దలుగొట్టారు. 

ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం, ఈవీఎం ధ్వంసం సహా మూడు హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో సోదరులతో కలిసి పరారయ్యారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తుండగా హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ బెయిలు పొందారు. ఆయన బెయిలు గడువు నేటితో ముగియనున్న నేపథ్యంతో అరెస్ట్‌కు పోలీసులు రెడీ అయ్యారు. గతంలోలా పోలీసుల కళ్లుగప్పి రాష్ట్రం విడిచి పారిపోకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో కాపలా కాస్తున్నారు.
Pinnelli Ramakrishna Reddy
Macherla
YSRCP

More Telugu News