Gorantla Butchaiah Chowdary: వైసీపీ సోషల్ మీడియాకు గోరంట్ల స్ట్రాంగ్ వార్నింగ్

TDP leader Gorantla Butchaiah Chowdary Warns YCP social media
  • టీడీపీపై వైసీపీ పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపాటు
  • వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియోను టీడీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
  • ఇలాంటి ఫేక్ న్యూస్ కట్టిపెట్టకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరిక
ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తోందని, వాటికి అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌లో వైసీపీ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు అయిన క్లిప్పింగ్‌ను షేర్ చేశారు.

చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడిచేస్తున్నారంటూ వైసీపీ ఓ వీడియోను షేర్ చేసింది.

దీనిని తీవ్రంగా పరిగణించిన బుచ్చయ్య చౌదరి ఎక్స్‌లో స్పందించారు. అది ఫేక్ వీడియో అని, గంజాయి, జే-బ్రాండ్ తాగి ఓటమికి మీరంటే మీరు కారణం అంటూ వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియో అదని పేర్కొన్నారు. దానిని టీడీపీ మీదకు నెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీచేశారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YCP Social Media
Fake Video

More Telugu News