Seethakka: అహంకారపూరిత రాజును మోకాళ్లపై నిలబెట్టిన యోధుడు రాహుల్ గాంధీ: సీతక్క

if Media should have showed the reality INDIA would have white wash the election says Seethakka
  • దేశంలో జరుగుతున్నదానిని మీడియా చూపించలేదన్న సీతక్క
  • వాస్తవాన్ని చూపించి ఉంటే ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేసి ఉండేదన్న మంత్రి
  • దేశం కోసం పోరాటం కొనసాగుతుందన్న నేత
లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి దగ్గరలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆగిపోవడంపై ఆ పార్టీ నేత, తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. మీడియా కళ్లకు గంతలు కట్టుకుందని, దేశంలో వాస్తవంగా జరుగుతున్నదేంటో నిజంగా చూపించి ఉంటే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి ఉండేదని అన్నారు. 

ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఓ యోధుడని కొనియాడారు. అహంకారంతో వ్యవహరించే షెహన్‌షా(రాజు)ను మోకాళ్లపై కూర్చోబెట్టారని మోదీని ఉద్దేశించి ఎక్స్‌లో పేర్కొన్నారు. తామంతా రాహుల్ వెంటే ఉన్నామని తెలిపారు. దేశం కోసం పోరాటం కొనసాగిద్దామని సీతక్క పేర్కొన్నారు.
Seethakka
Congress
Rahul Gandhi
INDIA Bloc

More Telugu News