QS world University Rankings: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రతిభ.. ప్రధాని శుభాకాంక్షలు

PM Modi hails educational progress as IIT Bombay IIT Delhi rank among top 150 in QS World University Rankings

  • క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 118 స్థానంలో ఐఐటీ బాంబే
  • జాబితాలోని భారత విద్యా సంస్థల్లో ముందువరుసలో నిలిచిన వైనం
  • ఐఐటీ ఢిల్లీకి 197, ఐఐఎస్‌సీకి 211, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 222,  ఐఐటీ మద్రాస్‌కు 227వ ర్యాంకు 
  • తొలి స్థానంలో మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • ఆసియా దేశాల్లో మూడో స్థానంలో నిలిచిన భారత్, తొలి రెండు స్థానాల్లో జపాన్, చైనా

గత దశాబ్ది కాలంలో భారత విద్యారంగ ప్రమాణాలు మెరుగవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్‌లో భారతీయ యూనివర్సిటీలు నానాటికీ మెరుగవుతుండటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో- 2025లో తాజాగా ఐఐటీ బాంబే 31 స్థానాలు మెరుగుపడి 118వ ర్యాంకు దక్కించుకుంది. ఈ జాబితాలోని భారత విద్యాసంస్థలు అన్నిటికంటే మెరుగైన ర్యాంకు సాధించింది. ఇక గతేడాది 197వ ర్యాంకు దక్కించుకున్న ఐఐటీ ఢిల్లీ ఈమారు 150 ర్యాంకుకు ఎగబాకింది. ఈ సందర్భంగా ప్రధాని ఐఐటీల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. పరిశోధన, సృజనాత్మకత పెంపొందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

విద్యా సంస్థ పాప్యులారిటీ, ఫాకల్టీ-స్టూడెంట్ల నిష్ఫత్తి, ఫ్యాకల్టీల కున్న సగటు సైటేషన్లు, అంతర్జాతీయ బోధనా సిబ్బంది నిష్ఫత్తి, అంర్జాతీయ విద్యార్థి నిష్పత్తి, రీసెర్చ్ నెట్వర్క్, ఉద్యోగావకాశాలు, సుస్థిరత తదితర అంశాల ఆధారంగా క్యూఎస్ వరల్డ్ ర్యాకింగ్స్ ను నిర్ణయిస్తారు. 

వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌.. ముఖ్యాంశాలు
  • అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ జాబితాలో వరుసగా 13వ ఏడాది తొలి స్థానంలో నిలిచింది. 
  • విద్యార్థుల ఉద్యోగార్హత పరంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా 44వ స్థానంలో నిలిచింది. 
  • ఆసియాలో అత్యధిక యూనివర్సిటీ ర్యాంకులు పొందిన దేశాల్లో భారత్ మూడోస్థానంలో నిలిచింది. జపాన్, చైనా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 
  • ఈ జాబితాలో 61 శాతం భారత యూనివర్సిటీల ర్యాంకులు మెరుగుపడగా, 24 యూనివర్సిటీలు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. మరో 9 శాతం యూనివర్సిటీల ర్యాంకులు తగ్గాయి. కొత్తగా మూడు భారత యూనివర్సిటీలు ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాయి. 
  • 37 భారతీయ విద్యాసంస్థలు తమ పరిశోధన విభాగాల్లో అభివృద్ధి సాధించాయి. ఫాకల్టీల సైటేషన్స్‌ మెరుగయ్యాయి.
  • ఈ జాబితాలో ఐఐఎస్‌సీకి 211, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 222, ఐఐటీ మద్రాస్‌కు 227 ర్యాంకు దక్కాయి. 
  • 2018 మధ్య కాలంలో ఐఐటీ బాంబే 15,905 రీసెర్చ్ పేపర్లు ప్రచురితమయ్యాయి. 143,800 సైటేషన్లు దక్కాయి. జాతీయ, ప్రపంచస్థాయి సగటు కంటే అధికంగా ఐఐటీ బాంబే పరిశోధనల్లో 30 శాతం అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 
  • ఐఐటీ ఢిల్లీ కూడా పరిశోధనల్లో మెరుగయ్యింది. 2018-22 మధ్య కాలంలో ఐఐటీ ఢిల్లీ నుంచి 16,439 పేపర్లు ప్రచురితమయ్యాయి. అక్కడి ఫ్యాకల్టీలకు 221,496 సైటేషన్లు దక్కాయి. 
  • భారత విద్యా వ్యవస్థను ఆధునికీకరించడంలో జాతీయ విద్యా విధానం ఓ గొప్ప ముందడుగు అని క్యూఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెస్సికా టర్నర్ వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News