K Kavitha: ఎమ్మెల్సీ కవితపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

ED files supplementary chargesheet in court
  • కవిత పాత్రపై ఛార్జిషీట్‌లో పేర్కొన్న సీబీఐ
  • నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ రిమాండ్
  • నేడు కస్టడీ కొనసాగింపుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం సప్లిమెంటరీ ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ఈరోజు విచారణ జరగనుంది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగుస్తోంది. జ్యుడీషియల్ కస్టడీ కొనసాగింపుపై రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది.

అంతకుముందు ఈడీ ఆరు సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు కిక్ బ్యాక్స్ రూపంలో వంద కోట్ల రూపాయలను కవిత ఇచ్చినట్లుగా ఈడీ పేర్కొంది. అదే సమయంలో బెనిఫిట్ రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి రూ.192 కోట్లను ప్రాఫిట్‌గా పొందినట్లు పేర్కొంది. మొత్తంగా రూ.292 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో కవిత పేరును ఈడీ తొలిసారి ఛార్జిషీట్‌లో పేర్కొంది.
K Kavitha
BRS
Delhi Liquor Scam
CBI

More Telugu News