India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

latest weather forecast predicts a 40 to 50 Percent chance of rain during India vs Pakistan Match

  • వర్షం ముప్పు పొంచి ఉందన్న వాతావరణ రిపోర్ట్
  • టాస్ సమయంలో 40-50 శాతం మేర వాన పడే ఛాన్స్
  • పూర్తిగా 20 ఓవర్ల మ్యాచ్ జరగక పోవచ్చని అంచనా

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జూన్ 9న హైవోల్టేజీ క్రికెట్ సమరం జగరనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌ పూర్తిగా 20 ఓవర్ల పాటు జరగక పోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని ‘అక్యూ వెదర్’ రిపోర్ట్ ప్రకటించింది.

అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల) ఈ మ్యాచ్ జరగనుండగా ఈ సమయంలో వర్షం పడే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది. టాస్ సమయంలో 40 శాతం నుంచి 50 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్ష సూచన మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 శాతానికి తగ్గి.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ 40 శాతానికి పెరగనుందని అంచనా వేసింది.

మ్యాచ్ జరగనున్న జూన్ 9న వాతావరణం 58 శాతం తేమగా, ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుందని అక్యూ వెధర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ రిపోర్టులను బట్టి చూస్తే వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

వర్షం కీలక పాత్ర!
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో వర్షం కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ స్టేడియంలో స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసే జట్లు బాగా ఇబ్బంది పడుతున్నాయి. భారత్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్‌లోనూ ఇదే కనిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ అదే జరిగింది.

  • Loading...

More Telugu News