Ramoji Rao: రామోజీరావు కుటుంబ సభ్యులను ఓదార్చిన చంద్రబాబు

Chandrababu pays tributes to Ramoji Rao mortal remains
  • రామోజీరావు కన్నుమూత
  • ఈ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
  • రామోజీ పార్థివ దేహానికి నివాళులు
ఈనాడు పత్రికతో మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన చెరుకూరి రామోజీరావు ఇక లేరు. అక్షరమే ఆయుధంగా ఎలుగెత్తిన ఆ గొంతుక శాశ్వతంగా మూగబోయింది. గుండె సంబంధిత సమస్యతో రామోజీరావు కన్నుమూశారు. 

రామోజీ మరణవార్త తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు... తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి వెళ్లి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పరామర్శించారు. తీవ్ర విషాదంలో ఉన్న రామోజీ కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు.
Ramoji Rao
Demise
Chandrababu
Condolences
Nara Bhuvaneswari
Eenadu

More Telugu News