Ramoji Rao: రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన నారా లోకేశ్, బ్రాహ్మణి

Nara Lokesh and Brahmani pays tributes to Ramoji Rao mortal remains
  • తీవ్ర అనారోగ్యంతో రామోజీరావు కన్నుమూత
  • రామోజీ ఫిలింసిటీలో ప్రజల సందర్శనార్థం రామోజీ భౌతికకాయం
  • రామోజీ తనయుడు కిరణ్ ను పరామర్శించిన నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ హైదరాబాదులోని రామోజీ ఫిలింసిటీలో రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తన అర్ధాంగి నారా బ్రాహ్మణితో కలిసి వచ్చిన లోకేశ్... రామోజీరావు భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచారు. అనంతరం, రామోజీ తనయుడు కిరణ్ ను పరామర్శించారు. 

నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
Ramoji Rao
Demise
Nara Lokesh
Nara Brahmani
Hyderabad

More Telugu News