Ramoji Rao: సోదరి నాగసుశీలతో కలిసి రామోజీరావు భౌతికకాయం వద్ద నాగార్జున నివాళులు

Nagarjuna pays tributes to Ramoji Rao mortal remains
  • రామోజీరావు అస్తమయం
  • ఫిలింసిటీలో రామోజీరావు భౌతికకాయం
  • నివాళులు అర్పిస్తున్న సెలెబ్రిటీలు
ఈనాడు సంస్థల అధినేత, పాత్రికేయ రంగ కురువృద్ధుడు రామోజీరావు అస్తమయం చెందారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిలింసిటీలోని నివాసంలో రామోజీ భౌతిక కాయాన్ని ఉంచారు. ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున, తన సోదరి నాగసుశీలతో కలిసి ఫిలింసిటీకి వచ్చి రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం, రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీ తనయుడు కిరణ్ తో మాట్లాడి, ఆయనను ఓదార్చారు.
Ramoji Rao
Demise
Nagarjuna
Naga Susheela
Hyderabad
Tollywood

More Telugu News