Bandi Sanjay: బండి సంజయ్‌, కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవులు.. ఢిల్లీకి బయలుదేరిన నేతలు

Kishan Reddy And Bandi Sanjay Offered Central Cabinet Berths
  • తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ
  • కిషన్‌రెడ్డికి మరోమారు మంత్రి పదవి
  • ప్రధానమంత్రితో తేనేటి విందు కోసం ఒకే కారులో బయలుదేరిన ఇద్దరు ఎంపీలు
కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు లభించాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించారు.

తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌లు పక్కా అని తెలిసినప్పటికీ అది ఎవరన్న విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఇప్పుడీ విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్‌లు లభించాయి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వీరిద్దరికీ ఫోన్‌ లో సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఢిల్లీ బయలుదేరారు. ప్రధానమంత్రి నివాసంలో జరిగే తేనీటి విందు కోసం కిషన్‌రెడ్డి నివాసం నుంచి ఇద్దరూ బయలుదేరారు. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్రమంత్రి పదవులు లభించడంతో బీజేపీ రాష్ట్ర శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Bandi Sanjay
G. Kishan Reddy
Union Cabinet
BJP
Telangana

More Telugu News