Female Ministers: మోదీ మంత్రివర్గంలో తగ్గిన మహిళా మంత్రుల సంఖ్య!

Seven women sworn in as Union Ministers in new Team Modi
  • గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు
  • ఈమారు ఏడుగురు మహిళలకే మంత్రిగా బాధ్యతలు
  • నిర్మలాసీతారామన్, దేవిలకు కేబినెట్ హోదా
  • మిగతా వారిని సహాయమంత్రులుగా ఎంపిక
ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఈసారి మహిళా మంత్రుల సంఖ్య తగ్గింది. ఆదివారం ఎన్డీయే మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం ఏడుగురు మహిళలను మంత్రి పదవులు వరించగా వారిలో ఇద్దరికి కేబినెట్ హోదా దక్కింది. అయితే, గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండటం గమనార్హం. 

మంత్రి వర్గంలో తిరిగి చోటు దక్కని వారిలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, భారతీ పవార్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, దర్శనా జార్దోశ్, మీనాక్షీ లేఖీ, ప్రతిమా భౌమిక్ ఉన్నారు. మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరండల్జే, రక్షా ఖడ్సే, సావిత్రీ ఠాకూర్, నిమూబెన్ భంభానియా, అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. 

నిర్మలా సీతారామన్, దేవీలకు కేబినెట్ హోదా దక్కింది. మిగతా వారు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవీ, ఖరండల్జే, ఖడ్సే, షెరావత్, పటేల్‌లకు కొత్తగా మంత్రివర్గంలో స్థానం దక్కింది. గత లోక్‌సభలో మొత్తం 78 మంది మహిళా ఎంపీలు ఉండగా ఈ సారి వారి సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 74 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు.
Female Ministers
Modi 3.0 Cabinet
NDA

More Telugu News