Hamas: ఇజ్రాయెల్ ఆర్మీ ముందుకొస్తే బందీల కాల్చివేత.. హమాస్ ఆదేశాలు!

Hamas operatives have been ordered to shoot the captives if Israeli forces advancing

  • హమాస్ మిలిటెంట్లకు అందిన ఆదేశాలు
  • ‘న్యూయార్క్ టైమ్స్‌’లో ప్రచురితమైన కథనం
  • ఇటీవలే నలుగురు బందీలను విడిపించిన ఇజ్రాయెల్ రక్షణ బలగాలు

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చెరలో గత 9 నెలలుగా బందీలై ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ముమ్మర వేట కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ అస్థిర పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ బలగాలు ముందుకు వస్తే బందీలను చంపివేయాలంటూ గాజాలోని హమాస్ మిలిటెంట్లకు ఆదేశాలు వెళ్లాయంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం పేర్కొంది.

గాజాలో ఉన్న బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ సమీపిస్తున్నట్టుగా గుర్తిస్తే బందీలను కాల్చివేయాలని టాప్ నేతలు ఆదేశించినట్టు కథనం పేర్కొంది. హమాస్ చెరలో ఉన్న నలుగురు బందీలను ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విజయవంతంగా విడిపించిన నేపథ్యంలో ఈ వార్త వెలువడింది.

కాగా గతేడాది అక్టోబర్ నెలలో ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఆ సమయంలో 200 మంది అమాయకులను బందీలుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఈ పౌరులకు విముక్తి కల్పించేందుకు ఇజ్రాయెల్ బలగాలు కృషి చేస్తున్నాయి. అమెరికన్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ విశ్లేషకులతో కూడిన ప్రత్యేక యంత్రాంగం బందీల విడుదల కోసం నిర్విరామంగా కృషి చేస్తోందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. బందీల కదలికలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని వెల్లడించింది.

  • Loading...

More Telugu News