Andhra Pradesh: ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి: గవర్నర్ ను కోరిన కూటమి నేతలు

ap nda leaders meet governor request to invite them to form govt
  • ఏపీ గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు  
  • కూటమి తరఫున చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు వెల్లడి
  • గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు లేఖ సమర్పణ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ర్ట అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మంగళవారం సమావేశం అయ్యారు.

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరఫున సభానాయకుడిగా టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాల్సిందిగా కోరారు. అనంతరం రాజ్ భవన్ వెలుపల అచ్చెన్నాయుడు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. తాము చేసిన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పురందేశ్వరి చెప్పారు. చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తమకు తెలియజేశారన్నారు.
Andhra Pradesh
Assembly
Governor
Justice Abdul Nazeer
NDA Leaders
Meet

More Telugu News