AEP SET Results: ఏపీలో ఏఈపీ సెట్ ఫలితాల విడుదల
- ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు
- 3.39 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు
- గత నెల 16 నుంచి 23 వరకు ఈఏపీ సెట్ పరీక్షల నిర్వహణ
- ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది విద్యార్థుల అర్హత
- అగ్రికల్చరల్ విభాగంలో 70,352 మంది విద్యార్థుల ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు.
గత నెల 16 నుంచి 23 వరకు ప్రభుత్వం ఈఏపీ సెట్ పరీక్షలను నిర్వహించింది. ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కీని విడుదల చేయగా, ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ను ప్రకటించడం జరిగింది. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్రికల్చరల్ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.