Australia: టీ20 వరల్డ్ కప్: దర్జాగా సూపర్-8లోకి ప్రవేశించిన ఆసీస్

Aussies entered Super8 after beating Namibia by 9 wickets
  • నమీబియాపై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం
  • తొలుత నమీబియాను 17 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్
  • 5.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి లక్ష్యఛేదన
  • వరుసగా మూడు విజయాలతో సూపర్-8 బెర్తు ఖరారు
మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ లో సూపర్-8 దశలోకి ప్రవేశించింది. నమీబియాతో జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ లో ఆసీస్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. 

తొలుత నమీబియాను 17 ఓవర్లలో 72 పరుగులకే చుట్టేసిన కంగారూలు... 73 పరుగుల లక్ష్యాన్ని 5.4 ఓవర్లలోనే ఛేదించారు. ఈ క్రమంలో ఆసీస్ జట్టు కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. 8 బంతుల్లో 20 పరుగులు చేసిన వార్నర్ వీజ్ బౌలింగ్ అవుటయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (34 నాటౌట్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (18 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. 

కాగా, గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా మూడో విజయం. తద్వారా 6 పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధించింది. ఇదే గ్రూప్ లో ఉన్న ఇంగ్లండ్ రెండు మ్యాచ్ ల్లో ఒక ఓటమితో అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. స్కాట్లాండ్ 3 మ్యాచ్ ల్లో రెండు విజయాలతో ఆసీస్ తర్వాత స్థానంలో ఉంది.
Australia
Super-8
Namibia
T20 World Cup 2024

More Telugu News