Renu Desai: పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్..!

Renu Desai Posted Interesting on Instagram to Wishes Pawan Kalyan
  • ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం 
  • తండ్రి ప్రమాణస్వీకారానికి సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు అకీరా, ఆద్య
  • పిల్లల ఫొటోలు షేర్ చేస్తూ పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన రేణు దేశాయ్
ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడం కోసం మెగా కుటుంబ సభ్యులు తరలివెళ్లారు. పవన్ పిల్లలు అకీరా, ఆద్య కూడా తమ తండ్రి ప్రమాణ స్వీకారం చూసేందుకు గన్నవరం వెళ్లారు. అయితే ప్రమాణ స్వీకారానికి అకీరా, ఆద్య సంప్రదాయంగా పద్ధతిగా రెడీ అయ్యారు. అకీరా పంచె కట్టగా, ఆద్య పంజాబీ డ్రెస్ ధరించింది. 

ఇలా చక్కగా రెడీ అయిన అనంతరం వారిద్దరూ తమ తల్లి రేణు దేశాయ్ కి వీడియో కాల్ చేశారు. దాంతో రేణు తన పిల్లల ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "నా పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డేకి ఇలా రెడీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్న పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు" అని పోస్ట్ చేశారు. ఇప్పుడీ పోస్ట్ సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది.    

ఇక మెగా కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో ప్రమాణస్వీకార వేదిక వద్దకు చేరుకోవడం జరిగింది. పవన్ కు రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవి లభించడంతో మెగా కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. రాంచరణ్, నాగబాబు, సురేఖ, సాయిదుర్గాతేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Renu Desai
Pawan Kalyan
Instagram

More Telugu News