Telangana TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాల విడుదల

Telangana TET 2024 Results Released

  • టెట్‌ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 
  • టెట్-2024కు మొత్తం 2,86,381 మంది అభ్యర్థుల దరఖాస్తు 
  • పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా 57,725 మంది ఉత్తీర్ణత 
  • పేపర్‌-2కు 1,50,491 మంది హాజరు కాగా 51,443 అభ్యర్థుల అర్హత
  • ఈసారి అర్హత సాధించని వారికి వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా 57,725 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పేపర్‌-2కు 1,50,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు.

పేపర్-1లో 67.13 శాతం, పేపర్-2లో 34.18 శాతం మంది అర్హత సాధించారని అధికారులు వెల్లడించారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగిందని పేర్కొన్నారు. ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in లో చూడొచ్చన్నారు.  

ఈ సందర్భంగా అభ్యర్థులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని వారికి వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కాగా, డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News