Narendra Modi: చంద్రబాబు కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో ఇదిగో!

PM Modi photographed with Chandrababu family members

  • ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు
  • ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
  • పట్టరాని సంతోషంతో చంద్రబాబును హత్తుకుని అభినందించిన మోదీ
  • చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ లతో మోదీ ఫొటో

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని మోదీ అమితానందం వ్యక్తం చేశారు. పట్టలేని సంతోషంతో చంద్రబాబును హత్తుకుని, వీపు తడుతూ అభినందనలు తెలిపారు.

కాగా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ప్రధాని మోదీ... సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోలో మోదీతో పాటు చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, నారా దేవాన్ష్ ఉన్నారు. మోదీ... లోకేశ్ తనయుడు దేవాన్ష్ భుజాలపై చేతులేసి చిరునవ్వులు చిందిస్తూ నిల్చుని ఉండడం ఈ ఫొటోలో చూడొచ్చు.

విజయోత్సాహం ఎలా ఉంటుందో ఈ ఫొటోలో మోదీ, చంద్రబాబు తదితరుల ముఖాలు వెలిగిపోతున్న తీరు చెప్పకనే చెబుతుంది.

  • Loading...

More Telugu News