Piyush Goyal: తిరుమల ఆలయంలో చంద్రబాబును కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేంద్రమంత్రి పియూష్ గోయల్

Union minister Piyush Goyal met CM Chandrababu in Tirumala Temple
  • నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం
  • అదే సమయంలో ఆలయంలోకి వచ్చిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
  • చంద్రబాబును చూసి సంతోషం వ్యక్తం చేసిన వైనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అటు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సైతం ఇవాళ కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. 

ఆలయంలో చంద్రబాబును చూసి పియూష్ గోయాల్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు కూడా మరోసారి కేంద్ర క్యాబినెట్ లో చోటు సంపాదించుకున్న పియూష్ గోయల్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, తన స్పందనను ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

"చంద్రబాబు గారూ... మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కలవడం అద్భుతంగా అనిపించింది. మీ హార్దిక శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, మీ నాయకత్వంలో మనం కలిసి పని చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ శకంలోకి మళ్లిద్దాం" అంటూ పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.
Piyush Goyal
Chandrababu
Tirumala
BJP
TDP
Andhra Pradesh

More Telugu News