Mega DSC: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం

Chandrababu govt issues new notification for Mega DSC
  • ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
  • మెగా డీఎస్సీపై తొలి సంతకం
  • పాత నోటిఫికేషన్ సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ
ఏపీలో కొత్తగా కొలువు దీరిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలుపుకునే దిశగా నేడు తొలి అడుగు వేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. 

సీఎం ఆమోదం లభించిన నేపథ్యంలో... పాత నోటిఫికేషన్ ను సవరిస్తూ, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. 

కొత్త నోటిఫికేషన్ ప్రకారం మెగా డీఎస్సీలో 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,371 ఎస్జీటీ పోస్టులు, 1,781 టీజీటీ పోస్టులు, 286 పీజీటీ పోస్టులు, 132 పీఈటీ పోస్టులు, 52 ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
Mega DSC
New Notification
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News