TSPSC: గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్‌న్యూస్

Edit Option Opened for TSPSC group 2 services
  • దరఖాస్తులు ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు
  • ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు
  • ఎడిట్ చేసుకున్నాక పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచన
గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ టీజీపీఎస్సీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. 

ఎడిట్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని... మరో ఆప్షన్ ఉండదని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తులో తప్పిదాలు చేస్తే సరిదిద్దుకోవాలని సూచించింది. దరఖాస్తుల ఎడిట్ పూర్తయ్యాక తప్పనిసరిగా తమ దరఖాస్తును పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
TSPSC
Telangana

More Telugu News