RSS: ఆరెస్సెస్ అధినేతతో రేపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం

Yogi Adityanath to meet RSS chief

  • సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి సమావేశం
  • నిజమైన సేవకుడు అహంకారం కలిగి ఉండడని ఇటీవల భగవత్ వ్యాఖ్య
  • దీంతో యోగి-భగవత్ సమావేశానికి ప్రాధాన్యత

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రేపు ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్‌తో భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వీరిద్దరు మొదటిసారి సమావేశమవుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ కీలకం. ఇక్కడ 2014, 2019లలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కమలం పార్టీ... ఈసారి 33 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష ఇండియా కూటమి 43 సీట్లు గెలుచుకుంది. 

అంతేకాకుండా, నిజమైన సేవకుడు అహంకారం కలిగి ఉండడని... ఇతరులకు హాని కలిగించకుండా పని చేస్తాడని మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం, వీరి మధ్య సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. వారి మధ్య లోక్ సభ ఎన్నికల ఫలితాలు, ఉత్తర ప్రదేశ్‌లో ఆరెస్సెస్ విస్తరణతో పాటు పలు అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News