Telangana: తెలంగాణలో పాఠ్యపుస్తకాల వివాదం... ఇద్దరు అధికారులపై వేటు

Two officers suspended in Telangana

  • పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ల తొలగింపు
  • పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌కు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌గా బాధ్యతల అప్పగింత
  • టీఆర్ఈఐఎస్ కార్యదర్శికి పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతల అప్పగింత

తెలుగు పాఠ్యపుస్తకాలలో ముందుమాటలో చోటు చేసుకున్న తప్పులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ పుస్తకాలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం... అధికారులపై చర్యలకు ఆదేశించింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి వీరిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌గా... పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌ను, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్‌గా... టీఆర్ఈఐఎస్ కార్యదర్శి రమణ కుమార్‌కు బాధ్యతలను అప్పగించారు.

ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల్లో ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించారు. దీంతో 24 లక్షల పుస్తకాలను వెనక్కి తీసుకున్నారు. తొలుత ఆ పేజీలను చించేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ దాని వెనుక వందేమాతరం, జాతీయగీతం, ప్రతిజ్ఞ ఉండటంతో... స్టిక్కర్ వేయాలని నిర్ణయానికి వచ్చారు.

  • Loading...

More Telugu News