T20 World Cup 2024: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమణ

Pakistan knocked out from Super 8 race after rain washes out USA vs IRE match in T20 World cup 2024

  • వర్షం కారణంగా ఐర్లాండ్-అమెరికా జట్ల మ్యాచ్ రద్దు
  • ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయింపు
  • 5 పాయింట్లతో సూపర్-8కి అర్హత సాధించిన ఐర్లాండ్
  • 2 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్ లీగ్ దశ నుంచే నిష్క్రమణ 
  • ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకున్న భారత్

టీ20 వరల్డ్ కప్ 2024లో దాయాది దేశం పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. సూపర్-8 దశ నుంచి జట్టు నిష్క్రమించింది. శుక్రవారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో అమెరికా- ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పర్యవసానంగా 5 పాయింట్లలో యూఎస్ఏ జట్టు సూపర్-8 దశకు అర్హత సాధించింది. 

జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్థాన్ తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించినా ఆ జట్టు వద్ద 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి. గ్రూప్-ఏలో ఇతర జట్లేవీ 5 పాయింట్లు సాధించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే 5 పాయింట్ల ఉన్న అమెరికా, 6 పాయింట్లతో ఉన్న భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టాయి. 

కాగా ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో యూఎస్ఏ-ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మైదానం చిత్తడిగా ఉన్న కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. నిర్దేశిత సమయం వేచిచూసిన తర్వాత కూడా మ్యాచ్ నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు రద్దు చేశారు.

 సూపర్-8లో ఆస్ట్రేలియాతో ఢీ..
సూపర్-8 దశలో టీమిండియా గ్రూప్-1లో ఉంటుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లతో పాటు బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్‌‌ జట్లలో ఒక దానితో తలపడాల్సి ఉంటుంది. ఇక గ్రూప్‌-2లో ఉండనున్న అమెరికా జట్టు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో పాటు ఇంగ్లండ్ లేదా స్కాట్లాండ్‌లలోని ఒక జట్టుని ఢీకొట్టాల్సి ఉంటుంది. కాగా జూన్ 19న సూపర్-8 మ్యాచ్‌లు షురూ కానున్నాయి. ఆంటిగ్వా, బార్బడోస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ వేదికగా మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక తొలి సెమీఫైనల్ జూన్ 26న ట్రినిడాడ్‌లో, జూన్ 27న జరగనున్న రెండవ సెమీఫైనల్‌‌ గయానాలో జరగనున్నాయి. జూన్ 29న బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News