YS Jagan: హైదరాబాదులో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు

- హైదరాబాదులోని లోటస్ పాండ్ వద్ద జగన్ నివాసం
- ఫుట్ పాత్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు
- రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు
హైదరాబాదు లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన ఈ సెక్యూరిటీ అవుట్ పోస్టు కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యకంగా కలిగిస్తున్నాయని, ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందాయి.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి, జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. కాగా, జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.

Illegal Structures Demolished Near Jagan's House in Hyderabad
— Sudhakar Udumula (@sudhakarudumula) June 15, 2024
The Greater Hyderabad Municipal Corporation (GHMC) demolished illegal structures in front of Y.S. Jagan Mohan Reddy's residence in Lotus Pond today. The unauthorized constructions, intended for Jagan's security, had… pic.twitter.com/tPCTZXJW1H