Bill Gates: మైక్రోసాఫ్ట్ విజయానికి భారతీయులే కారణం: బిల్ గేట్స్

Bill gates said Indians are behind Microsoft raise

  • జెరోడా సహ వ్యవస్థాపకుడు నిఖిల్  కామత్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న గేట్స్
  • భారత్ తో తనకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉందని వెల్లడి
  • మైక్రోసాఫ్ట్ ఎదుగుదల వెనుక భారతీయ నిపుణుల కృషి ఉందని స్పష్టీకరణ

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా జెరోడా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్ ఈ స్థాయికి ఎదగడానికి భారతీయులే కారణమని అన్నారు. 

మైక్రోసాఫ్ట్ విజయవంతం కావడం వెనుక అనేకమంది అద్భుతమైన నిపుణులు ఉన్నారని, వారిలో అత్యధికులు భారత్ నుంచి వచ్చిన వారేనని వెల్లడించారు. భారతదేశంతో తనకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉందని, మైక్రోసాఫ్ట్ స్థాపించాక భారత్ లో నైపుణ్యమున్న పట్టభద్రులను ఎంపిక చేసుకుని నియమించుకున్నామని గేట్స్ వెల్లడించారు. వారికి సియాటెల్ లో విధులు అప్పగించామని, వారు భారత్ తిరిగి వచ్చి మైక్రోసాఫ్ట్ డెవలప్ మెంట్ సెంటర్ స్థాపనలో కీలకపాత్ర పోషించారని వివరించారు. 

సత్య నాదెళ్ల కూడా భారత్ నుంచి వచ్చిన వారేనని, ఇప్పుడాయన మైక్రోసాఫ్ట్ లో అగ్రస్థానంలో ఉన్నారని బిల్ గేట్స్ తెలిపారు. ఐటీ రంగంలో తన కెరీర్ ప్రారంభంలో భారత్ తో ఉన్న అనుబంధం ఇప్పుడు కీలకంగా మారిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News