Crocodile: భారీ మొసలిని కొట్టి చంపి కోసుకుతిన్న గ్రామస్థులు.. ఆస్ట్రేలియాలో ఘటన

Dog Eating Crocodile That Terrorised Australian Village Killed And Cooked For Feast

  • తరచూ నదీ తీరానికి రావడంతో గ్రామస్థుల్లో భయాందోళన
  • వీధి శునకాలను స్వాహా చేసిన మొసలి
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు

నదిలో నుంచి తరచూ ఒడ్డుకు వస్తూ భయాందోళనలకు గురిచేస్తున్న భారీ మొసలిని పోలీసులతో కలిసి గ్రామస్థులు మట్టుబెట్టారు. కొట్టి చంపేసి ఆపై కోసుకుని తినేశారు. ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా బయటకు వచ్చింది. మారుమూల గ్రామం కావడంతో మొసలిని జూకు తరలించే వీలు లేకుండా పోయిందని, చంపకుండా వదిలివేస్తే గ్రామస్థుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందనే ఉద్దేశంతోనే చంపాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.

ఆస్ట్రేలియాలో గతేడాది వచ్చిన వరదలకు చాలా గ్రామాలు నీట మునిగాయి. ఎక్కడెక్కడి నుంచో జలచరాలు కొత్త ప్రదేశాలకు చేరాయి. ఆ సమయంలోనే మూడున్నర మీటర్ల పొడువున్న ఓ భారీ మొసలి నార్తరన్ ఆస్ట్రేలియాలోని ఓ నదిలోకి చేరింది. ఆ నదికి పావు కిలోమీటరు దూరంలోనే ఓ చిన్న గ్రామం ఉంది. ఈ మొసలి నీటిలో నుంచి తరచూ ఒడ్డుకు వస్తూ వీధి శునకాలను చంపి తింటోంది. ఇది గమనించిన గ్రామస్థులు మొసలి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

అయితే, అంత భారీ మొసలిని భద్రంగా జూ కు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. గ్రామస్థులతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక ఆ మొసలిని చంపేయాల్సిందేనని, లేదంటే గ్రామస్థులకు ముప్పు తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ఆపై మొసలిని కాల్చి చంపిన పోలీసులు.. దానిని గ్రామంలోకి చేర్చగా గ్రామస్థులు దానిని కోసుకుని తిన్నారు. సంప్రదాయబద్ధంగా విందు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News