Trains Cancelled: నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లోనంటే !

Trains Cancelled For One Month In This Route Details Here
  • కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రైళ్లు రద్దు
  • ప్యాసింజర్ తో పాటు సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా..
  • సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులే కారణం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ సహా సూపర్ ఫాస్ట్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, దీనికి కారణం ఏంటనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ రూట్ లో సిగ్నల్ వ్యవస్థను ఆధునికీకరించే పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. సిగ్నల్ వ్యవస్థ లోపం వల్లే బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొని ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సిగ్నల్ వ్యవస్థను రైల్వే ఆధునికీకరిస్తోంది.

రద్దు చేసిన రైళ్లు..
17003 కాజీపేట-కాగజ్‌నగర్ రైలు ఈ నెల 17 నుంచి జులై 6 వరకు
12757/58 కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23 నుంచి జులై నెల 6 వరకు
12967 చెన్నై-జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 25, 30, జులై 2,7 తేదీల్లో రద్దు
12968 జైపూర్-చెన్నై జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21, 23, 28, 30, జులై 5న రద్దు
12975 మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 27, 29, జులై 4, 6 తేదీల్లో రద్దు
12539 యశ్వంత్‌పూర్-లక్నో ఈ నెల 26, జులై 3న రద్దు
12540 లక్నో-యశ్వంత్‌పూర్ ఈ నెల 28, జులై 5 తేదీల్లో రద్దు
12577 భాగమతి-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 28న మరియు వచ్చే నెల 5న రద్దు
22619 బిలాస్‌పూర్-త్రివేండ్రం తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25, జులై 2 రద్దు
22620 త్రివేండ్రం-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు
22352 పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణో ఈ నెల 21, 28, జులై 5వ తేదీల్లో రద్దు
22352 శ్రీమాత వైష్ణో-పాటలీపుత్ర ఈ నెల 24, జులై 1, 8 తేదీల్లో రద్దు
Trains Cancelled
Indian Railways
SCR
Kazipet
Sirpur khagaz nagar
Super fast Train

More Telugu News