DRDO: స్వల్ప శ్రేణి గగనతల రక్షణ మిసైళ్లను పరీక్షించనున్న డీఆర్‌డీఓ

DRDO to test shoulder fired air defence missiles at high altitudes

  • ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాల కోసం స్వల్ప శ్రేణి మిసైళ్లను అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీఓ
  • త్వరలో ఎత్తైన ప్రదేశాల్లో మిసైళ్లను పరీక్షించనున్న  వైనం
  • చైనా, పాక్ దాడులను అడ్డుకునేందుకు వీలుగా మిసైళ్ల అభివృద్ధి

డ్రోన్లు, ఫైటర్ విహంగాలను కూల్చేందుకు అనువైన షోల్డర్ ఫైర్డ్ (భుజంపై పెట్టుకుని ప్రయోగించే) స్వల్ప శ్రేణి గగనతల రక్షణ మిసైళ్ల అభివృద్ధిపై డీఆర్‌డీఓ విస్తృతస్థాయిలో కసరత్తు చేస్తోంది. లడఖ్, సిక్కిం లాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఈ మిసైళ్ల పనితీరును పరీక్షించేందుకు తాజాగా ఏర్పాట్లు చేస్తోంది. ట్రైపాడ్ స్టాండ్ నుంచి మిసైళ్ల ప్రయోగం ద్వారా వీటి పనితీరును డీఆర్‌డీఓ అంచనా వేయనుంది. భారత్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ అవసరాలకు అనుగూణంగా స్వల్ప శ్రేణి మిసైల్ రక్షణ వ్యవస్థను డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తోంది. ఈ పరీక్షలు విజయవంతమయ్యాక వీటిని రక్షణ బలగాలకు అప్పగిస్తారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి, మిసైల్ వ్యవస్థ అభివృద్ధిలో మంచి పురోగతి సాధిస్తున్నామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

వివిధ రకాల స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు భారత్ ఆర్మీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వీటి అభివృద్ధి కోసం రూ.6,800 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్, చైనా నుంచి  పొంచి ఉన్న గగనతల ప్రమాదాల నుంచి రక్షణ కోసం షోల్డర్ ఫైర్డ్ మిసైళ్లు అవసరమని ఆర్మీ భావిస్తోంది. వీటిని భుజంపై పెట్టుకుని ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత్‌ వద్ద  స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ అన్నింటిలో.. లక్ష్యాలను గుర్తించి ఛేదించేందుకు అవసరమైన ఐఆర్ హోమింగ్ గైడెన్స్ వ్యవస్థ ఉంది.

  • Loading...

More Telugu News